![]() |
![]() |
.webp)
సుడిగాలి సుధీర్ మొత్తానికి కాలుపెట్టిన ప్రతీ షోలో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు పార్టీ చేద్దాం పుష్ప న్యూ ప్రోమో రిలీజై సందడి చేస్తోంది. ఇక ఈ షోకి నాగబాబు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. సుధీర్ నాగబాబు చూసి వెల్కమ్ సర్ అంటాడు . ఎవరు ఎవరికీ వెల్కమ్ చెప్తున్నార్రా అంటూ నాగబాబు కామెడీ చేస్తాడు. అందరం చాలా మిస్సయ్యామ్ సుధీర్ అనేసరికి ఒక్క హగ్ డాడీ అంటూ నాగబాబుని కౌగిలించుకుంటాడు సుధీర్. తర్వాత ధనరాజ్ ఒక పాట పాడతాడు. కొణిదెల నాగబాబు కొణిదెల , నువ్వేలే మా అందరి భీమ్లా అనేసరికి నాగబాబు పగలబడి నవ్వుతాడు. విడుదల, బిడ్డకు విడుదల, ఇక నుంచి నీ లైఫు కళకళ అంటూ సుధీర్ ని చూస్తూ సాంగ్ ఎండ్ చేస్తాడు. సుధీర్ ఎక్కడున్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి.
జబర్దస్త్ ని ఎట్టి పరిస్థితిలో విడిచిపోను అన్న సుధీర్ ఆ షోని వదిలేసాడు, ఢీ వదిలేసాడు, శ్రీదేవి డ్రామా కంపెనీ వదిలేసి స్టార్ మాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఏదైమైనా సుధీర్ ఏ ఛానల్ లో షో చేస్తే ఆ షోకి రేటింగ్ బాగా పెరుగుతుండడంతో సుధీర్ ఇప్పుడు నిర్వాహకుల పాలిట బంగారు గుడ్లు పెట్టె బాతులా మారాడు. ఇప్పుడొస్తున్న కొత్త కొత్త షోస్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఒక వెలుగు వెలిగిన షోస్ మాత్రం సరైన హోస్ట్స్ లేక, జడ్జెస్ లేక వెలవెలబోతున్నాయి. ఐతే ఈ షోలో రష్మీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో ఒక చోటైనా కనిపిస్తుందేమో సుధీర్ ని రష్మిని చూసే అవకాశం కలుగుతుంది అని ఆశపడిన నెటిజన్స్ కి మాత్రం కొంచెం నిరాశ కలిగిందని చెప్పొచ్చు.
![]() |
![]() |